శివ కార్తికేయన్ సినిమాలో సేతుపతి? దీనిపై క్లారిటీ.!

Published on Jul 28, 2022 9:03 am IST

తెలుగులో ఇప్పుడు మంచి ఆదరణ అందుకుంటున్న తమిళ్ యంగ్ హీరోస్ శివ కార్తికేయన్ కూడా ఒకడు. తమిళ్ ఇండస్ట్రీ లో నాచురల్ స్టార్ నాని లాంటి హీరో తాను అని మన వాళ్ళు అంటారు. ఇక ఈ యంగ్ హీరో రీసెంట్ గానే డాక్టర్, డాన్ సినిమాలతో మంచి హిట్స్ బ్యాక్ టు బ్యాక్ అందుకోగా ఇక టాలీవుడ్ దర్శకుడు అనుదీప్ తో “ప్రిన్స్” అనే సినిమాలో నటించి తెలుగు సహా తమిళ్ లో ఏకకాలంలో నటించాడు.

ఇక ఈ చిత్రం తర్వాత మరో సినిమా “మావీరన్” సినిమా కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాలో ఓ కీలక పాత్రకి గాను విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించబోతున్నట్టుగా పలు రూమర్స్ బయటకి వచ్చాయి. అయితే దీనిపై ఇప్పుడు క్లారిటీ బయటకి వచ్చింది.

సేతుపతి నటిస్తున్నాడన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఈ వార్తలు అవాస్తవం అని సినీ వర్గాలు కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు విజయ్ సేతుపతి రోల్స్ కి ఎలాంటి ఆసక్తి ఉందో తెలిసిందే. రీసెంట్ లో విక్రమ్ లో సేతుపతి రోల్ ఏ లెవెల్ ఇంపాక్ట్ కలిగించిందో కూడా అంతా చూసారు. అందుకే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి కావచ్చు.

సంబంధిత సమాచారం :