ఓటిటి డేట్ లాక్ చేసిన ‘మ‌హారాజ‌’

ఓటిటి డేట్ లాక్ చేసిన ‘మ‌హారాజ‌’

Published on Jul 8, 2024 11:00 AM IST

త‌మిళ విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి నటించిన రీసెంట్ మూవీ ‘మ‌హారాజ’ బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను నిథిల‌న్ స్వామినాథ‌న్ డైరెక్ట్ చేయ‌గా, పూర్తి క్రైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఇక విజ‌య్ సేతుప‌తి ప‌ర్ఫార్మెన్స్ కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు.

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గ‌ర ఏకంగా వంద కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టి విజ‌య్ సేతుప‌తి కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటిటి ఆడియెన్స్ ను థ్రిల్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ చిత్ర ఓటిటి రైట్స్ ను ప్ర‌ముఖ ఓటిటి ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ భారీ రేటుకు సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ను కూడా లాక్ చేసుకుంది. జూలై 12న ఈ చిత్రాన్ని ఓటిటిలో స్ట్రీమింగ్ చేయ‌నున్నట్లు నెట్ ఫ్లిక్స్ తాజాగా ప్ర‌క‌టించింది.

తమిళ‌, తెలుగు భాష‌ల‌తో పాటు మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సినిమాలో అనురాగ్ క‌శ్య‌ప్, మ‌మ‌తా మోహ‌న్ దాస్, భార‌తీరాజా, అభిరామి త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. అజ‌నీష్ లోక‌నాథ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు