“చరణ్ 16” సినిమాపై విజయ్ సేతుపతి సాలిడ్ కామెంట్స్ వైరల్

“చరణ్ 16” సినిమాపై విజయ్ సేతుపతి సాలిడ్ కామెంట్స్ వైరల్

Published on Jun 19, 2024 11:31 PM IST

ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ తో తమ కెరీర్ లో 15వ సినిమాని చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా తర్వాత చరణ్ తన కెరీర్ 16వ సినిమాని యంగ్ దర్శకుడు బుచ్చిబాబు సానాకి అవకాశం ఇచ్చాడు. ఇక దీనిపై కూడా భారీ అంచనాలు ఉండగా కొన్నాళ్ల కితమే ఈ సినిమాని మేకర్స్ అనౌన్స్ చేశారు.

అయితే ఈ సినిమా విషయంలో అందరికీ అంత నమ్మకం ఎందుకు అంటే బుచ్చిబాబు తీసుకున్న కథ కోసమే అని చాలా మంది ఎగ్జైట్ అయ్యారు. కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ కూడా అసలు ఇలాంటి కథ ఎలా ఆలోచించారు అని బుచ్చిబాబుని ప్రశంసించారు. ఇక లేటెస్ట్ గా ఈ సినిమాపై మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సాలిడ్ కామెంట్స్ చేసారు.

తన లేటెస్ట్ హిట్ ‘మహారాజ’ (Vijay Sethupati Maharaja) విజయ వేడుకల్లో బుచ్చిబాబు కూడా పాల్గొన్నారు. మరి ఈ సందర్భంగా చరణ్, బుచ్చిబాబు సినిమాపై సేతుపతి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తనకి ఆ సినిమా మొత్తం కథ తెలుసు అని సినిమా చాలా బాగుంటుంది. సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని చాలా నమ్మకంగా చెప్పారు. దీనితో ఈ కామెంట్స్ చరణ్, మెగా ఫ్యాన్స్ లో మంచి ఎగ్జైట్మెంట్ ని తీసుకొచ్చాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు