“పుష్ప” రెండు సార్లు చూసాను – విజయ్ సేతుపతి

“పుష్ప” రెండు సార్లు చూసాను – విజయ్ సేతుపతి

Published on Jun 20, 2024 12:00 AM IST

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మహారాజ జూన్ 14, 2024న థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. రిలీజైన తొలిరోజు నుండే సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం సాధించిన విజయం పట్ల విజయ్ సేతుపతి సంతోషం గా ఉన్నారు. అయితే ఈ నటుడు పుష్ప చిత్రం పై చేసిన కామెంట్స్ ఇప్పటికే వైరల్ అయ్యాయి. అయితే పుష్ప చిత్రాన్ని రెండు సార్లు చూసినట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

పుష్ప చిత్రంలో విజయ్ సేతుపతి నటించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వలన అది కుదరలేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2 ది రూల్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఈ చిత్రం థియేటర్ల లోకి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు