అభిమానులకు పండగను ముందే తెచ్చేసిన స్టార్స్!
Published on Oct 27, 2016 11:47 pm IST

s3-bhairava
దీపావళి అంటే అందరికీ పెద్ద పండగ. వెలుగుల పండగైన ఈ దీపావళి వేళ కొత్త సినిమాలు థియేటర్లలో కళకళలాడడం సాధారణమే! అదేవిధంగా ఇప్పటికి సెట్స్‌పై ఉన్న సినిమాలు ఫస్ట్‌లుక్స్,, టీజర్స్‌తో సందడి చేయడం కూడా సాధారణంగా జరుగుతుంది. ఇక ఈ దీపావళికి తమిళ స్టార్ హీరోలైన విజయ్, సూర్యలు తమ అభిమానులకు ఒక మూడు రోజుల ముందే పండగ వాతావరణం తెచ్చేశారు. విజయ్ హీరోగా నటిస్తోన్న ‘భైరవ’ ఫస్ట్ టీజర్ విడుదలై అభిమానుల్లో ఉత్సాహం నింపింది.

పక్కా మాస్ ఎంటర్‌టైనర్ అయిన ఈ సినిమాలో విజయ్‌ని చూసి అభిమానులంతా ఫిదా అయిపోయారు. ఇక సూర్య సైతం ‘సింగం 3’ అంటూ తన మాస్ ఎంటర్‌టైనర్ మోషన్ పోస్టర్‌తో ఆకట్టుకున్నారు. ఈ ఇద్దరూ తమ తమ అభిమానులకు పండగ వాతావరణం తెచ్చేస్తూ విడుదల చేసిన ఈ లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిపోయాయి.

 
Like us on Facebook