తమిళనాట విజయ్ అరుదైన ఫీట్..!

Vijay TVK party results

తమిళ రాజకీయ చరిత్రలో ఎంజీఆర్, జయలలిత వంటి దిగ్గజాలకు కూడా సాధ్యం కాని అరుదైన ఘనతను విజయ్ దక్కించుకోబోతున్నాడు. సాధారణంగా వారు సీఎంగా బాధ్యతలు చేపట్టాక కొత్త సినిమాలు విడుదల కాలేదు. కానీ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన ఆఖరి చిత్రం ‘జన నాయకుడు’ రిలీజ్ కానుంది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాను మే 27న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే మేకప్‌కు శాశ్వత వీడ్కోలు పలికిన విజయ్, తన రాజకీయ ప్రస్థానం మొదలైన తరుణంలోనే ఈ సినిమా రావడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. తమిళనాడు వ్యాప్తంగా టీవీకే శ్రేణులు ఈ రిలీజ్‌ను ఒక పెద్ద పండుగలా జరిపేందుకు సిద్ధమవుతున్నాయి.

అయితే, రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదలకు వారం ముందే ఈ సినిమా వస్తుండటం, పైగా ఇది ‘భగవంత్ కేసరి’ రీమేక్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో దీనిపై ఆసక్తి తక్కువగానే ఉండవచ్చు. కానీ తమిళనాడులో మాత్రం ఒక ముఖ్యమంత్రి తన సొంత సినిమా విడుదలను థియేటర్లలో చూడబోతుండటం చరిత్రలో నిలిచిపోయే అరుదైన అంశం.

Exit mobile version