తమిళ డెబ్యూట్ కి సిద్దమవుతున్న విజయ్ దేవరకొండ ?

17th, December 2017 - 10:54:06 AM

‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ఒక్కసారిగా సంచలన హీరోగా మారిపోయిన విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్లో నటిస్తున్న ఆయన దీని తర్వాత పరశురామ్ తో ఒక సినిమా చేయనున్నారు. కేవలం తెలుగు దర్శకులేగాక తమిళ, కన్నడ దర్శకులు కూడా విజయ్ తో సినిమా చేసేందుకు ఉవ్విళూరుతున్నారు.

అలాంటి వాళ్ళలో విక్రమ్ తో ‘ఇరుముగన్’ చిత్రాన్ని చేసిన ఆనంద్ శంకర్ కూడా ఒకరు. విజయ్ నటన పట్ల ఇంప్రెస్ అయిన ఆనంద్ శంకర్ ఆయనకు ఒక స్క్రిప్ట్ వివరించారని, విజయ్ కు కూడా నచ్చిందని సమాచారం. అయితే ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న విజయ్ అవన్నీ పూర్తయిన తర్వాతే కొత్త ప్రాజెక్ట్స్ ను అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి.