వైజాగ్ లో సమంత తో రొమాన్స్ చేయనున్న విజయ్ దేవరకొండ!

Published on Jul 7, 2022 3:00 am IST

స్టార్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పటికే తన లైగర్ చిత్రం ను ప్రమోట్ చేస్తూనే, ఖుషి చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం లో సౌత్ స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.

విజయ్ మరియు సమంత ఇద్దరూ త్వరలో వైజాగ్‌కు వెళ్లనున్నారు మరియు అక్కడ అందమైన బీచ్ లోకేషన్స్ లో రొమాంటిక్ సాంగ్ చేయనున్నారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రం లో విజయ్ దేవరకొండ మరియు సమంతలు మొదటిసారి కలిసి నటించడంతో సినిమా పై మంచి బజ్ ఉంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :