లేటెస్ట్ : విజయ్ ‘వరిసు’ ఆడియో లాంచ్ ఈవెంట్ డేట్, టైం ఫిక్స్

లేటెస్ట్ : విజయ్ ‘వరిసు’ ఆడియో లాంచ్ ఈవెంట్ డేట్, టైం ఫిక్స్

Published on Dec 21, 2022 8:46 PM IST


ఇలయదళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో లేటెస్ట్ గా తెరకెక్కుతున్న రొమాంటిక్ యాక్షన్ మూవీ వరిసు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు ఈ మూవీని ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. తెలుగులో వారసుడు టైటిల్ తో రిలీజ్ కానున్న ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదలైన మూడు సాంగ్స్ కూడా ఆడియన్స్ ని విజయ్ ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకుని మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ చేసాయి.

అయితే విషయం ఏమిటంటే, వరిసు మూవీ యొక్క ఆడియో లాంచ్ ఈవెంట్ ని డిసెంబర్ 24న సాయంత్రం 4 గం. ల నుండి గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషయల్ గా అనౌన్స్ చేసారు. మరి మొదటి నుండి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ విడుదల తరువాత ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు