లేటెస్ట్ : భారీ కలెక్షన్ మార్క్ ని దాటేసిన విజయ్ ‘వరిసు’

Published on Feb 6, 2023 10:58 pm IST

ఇళయదళపతి విజయ్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ మూవీ వరిసు. తెలుగులో ఈ మూవీ వారసుడు టైటిల్ తో రిలీజ్ అయింది. ఇక విడుదలకి ముందు అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన వరిసు మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.

హీరో విజయ్ సూపర్ యాక్టింగ్, వంశీ పైడిపల్లి ఆకట్టుకునే దర్శకత్వ ప్రతిభ, ఎస్ థమన్ అందించిన సూపర్ సాంగ్స్, బీజీఎమ్, అలరించే రొమాంటిక్, హార్ట్ టచింగ్ ఎమోషనల్ సన్నివేశాలు, గ్రాండియర్ విజువల్స్, సూపర్ ఫైట్స్, భారీ నిర్మాణ విలువలు వెరసి ఈ మూవీని ఇంత పెద్ద సక్సెస్ చేసాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో భారీ వ్యయంతో నిర్మించిన ఈ సినిమా నేటితో వరల్డ్ వైడ్ ఏకంగా రూ. 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ మార్క్ ని దాటేసింది. ఈ విషయాన్ని మేకర్స్ కొద్దిసేపటి క్రితం అఫీషయల్ గా ప్రకటించారు. కాగా జయసుధ, శరత్ కుమార్, శ్రీకాంత్, సంగీత, ప్రకాష్ రాజ్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం :