ఇలయతలపతి విజయ్ ‘వరిసు’ నార్త్ అమెరికా హక్కులు వారికే

ఇలయతలపతి విజయ్ ‘వరిసు’ నార్త్ అమెరికా హక్కులు వారికే

Published on Nov 30, 2022 10:42 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో ఇలయతలపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా వరిసు. తెలుగులో వారసుడు టైటిల్ తో రిలీజ్ కానున్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా మహర్షి ఫేమ్ వంశీ పైడిపల్లి దీనిని ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరెక్కిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీత దర్శకుడు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ రంజితమే యూట్యూబ్ లో సూపర్ సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకుని మూవీ పై ప్రేక్షకాభిమానుల్లో మంచి అంచనాలు ఏర్పరిచింది.

ఇక 2023 సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కాబోతున్న వరిసు మూవీ యొక్క నార్త్ అమెరికా హక్కులని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ శ్లోక ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కాగా త్వరలో ఈ మూవీ నుండి సెకండ్ సాంగ్ అప్ డేట్ కూడా రాబోతోందట. మొత్తంగా అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ రేపు రిలీజ్ తరువాత ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో చూడాలని అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు