విజయ్ ‘వరిసు’ మూడవ సాంగ్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్

విజయ్ ‘వరిసు’ మూడవ సాంగ్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్

Published on Dec 19, 2022 6:01 PM IST

ఇళయదళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వరిసు. తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ కానున్న ఈ మూవీ 2023 సంక్రాంతి కానుకగా జనవరి రెండవ వారంలో ప్రేక్షకాభిమానుల ముందుకి రానుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా కార్తీక్ పళని ఫోటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు.

మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన వరిసు మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుని యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ఇక తెలుగులో కూడా ఆ సాంగ్స్ కి మంచి స్పందన లభించింది. కాగా ఈ మూవీ నుండి మూడవ సాంగ్ ‘సోల్ ఆఫ్ వారసుడు’ ని రేపు సాయంత్రం 5 గం. 30 ని. లకు రిలీజ్ చేస్తున్నట్లుగా కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్న వరిసు మూవీ రిలీజ్ తరువాత ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు