విషాదం: సీనియర్ నటుడు మృతి !

విషాదం: సీనియర్ నటుడు మృతి !

Published on Jan 20, 2025 1:00 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ కన్నుమూశారు. చెన్నైలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో విజయ రంగ రాజు గుండెపోటుతో మరణించారు. వారం క్రితం హైదరాబాద్ లో ఒక సినిమా షూటింగ్ లో విజయ రంగరాజు గాయపడ్డారు. ట్రీట్మెంట్ కోసం ఆయన చెన్నై వెళ్లి అక్కడే హాస్పిటల్ లో గుండెపోటుతో మరణించారు. ఇతనికి ఇద్దరు కూతుళ్లు. ఎక్కువగా విలన్ , సహాయ పాత్రలు పోషించారు. ఆయన అశోక చక్రవర్తి, స్టేట్ రౌడీ భైరవ ద్వీపం వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు.

ఐతే, యజ్ఞం సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. యజ్ఞం చిత్రంలో హీరోగా గోపీచంద్ నటించగా విలన్ పాత్రలో విజయ రంగరాజు నటించాడు. తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా ఆయన నటించారు. అలాగే, వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ లో కూడా ఈయనకు ప్రవేశం ఉంది. మా 123తెలుగు.కామ్ తరఫున విజయ రంగరాజు మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు