బాహుబలి, RRR ల రచయిత ప్రతిష్టాత్మక చిత్రం అనౌన్స్ మెంట్!

Published on Aug 17, 2022 5:32 pm IST

దేశంలోని అగ్ర రచయితలలో విజయేంద్ర ప్రసాద్ ఒకరు. బాహుబలి సిరీస్ చిత్రాలతో పాటుగా ప్రపంచానికి తెలుగు సినిమా ను పరిచయం చేసిన ఆర్ ఆర్ ఆర్ సినిమా రచయిత ఆరు భారతీయ భాషలలో రూపొందించబడే భారీ బడ్జెట్ పీరియాడికల్ డ్రామా కోసం సిద్ధమవుతున్నాడు. రాజమౌళి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన అశ్విన్ గంగరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

1770 అనే టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రంలో అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్ మరియు స్టార్ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రామ్ కమల్ ముఖర్జీ ఈ కాన్సెప్ట్‌ను రూపొందించారు. శైలేంద్ర కుమార్ మరియు సూరజ్ శర్మ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని అప్డేట్‌ల కోసం ఈ స్పేస్‌ని చూడండి.

సంబంధిత సమాచారం :