టీజరే అనుకుంటే దాన్ని మించేలా ఉన్న ‘అర్జున్ రెడ్డి’ ట్రైలర్ !


విజయ్ దేవరకొండ చేస్తున్న చిత్రాల్లో షూటింగ్ తో పాటు అన్ని కార్యక్రమాల్ని పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా ‘అర్జున్ రెడ్డి’. నూతన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ఈ చిత్రం యొక్క టీజర్ కొన్ని నెలల క్రితమే విడుదలై విశేషంగా ఆకట్టుకుని ప్రేక్షకుల్ని సినిమా కోసం ఎదురుచూసేలా చేయగా తాజాగా నిన్న బయటికొచ్చిన ట్రైలర్ దాన్ని మించేలా ఉంది.

హార్డ్ హిట్టింగ్ స్టోరీ లైన్ తో, బలమైన ఎమోషన్స్ తో, ప్రస్తుత ప్రేక్షకుల ఆలోచనలకు తగ్గట్టు సినిమా ఉంటుందని స్పష్టంగా చెబుతున్న ఈ ట్రైలర్ భిన్నత్వాన్ని కోరుకునే ఆడియన్సుని ముఖ్యంగా యువతకి చాలా దగ్గరైపోయింది. నలుగురు సినిమా ప్రియులు ఒక చోట చేరితే ఈ ట్రైలర్ సంగతులే వినిపిస్తున్నాయి. అంతలా జనాల్లోకి వెళ్ళిపోయిందీ ట్రైలర్.

ఆగస్టు 5న విడుదలకానున్న ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ ఫిలిమ్స్, కే.ఎఫ్.సి ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి ఏపి, తెలంగాణాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ వంగ నిర్మిస్తుండగా షాలిని హీరోయిన్ గాను అలనాటి కాంచ‌న, విపిఎస్. కళ్యాణ్, జియా శ‌ర్మ‌, ప్రియ‌ద‌ర్శి, క‌మ‌ల్ కామ‌రాజు, సంజ‌య్ స్వ‌రూప్‌ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ట్రైలర్ కొరకు క్లిక్ చేయండి