విజయ్ “బీస్ట్” ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్…అభిమానులకు ఇక పండగే!

Published on Mar 30, 2022 7:14 pm IST

తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం బీస్ట్. ఈ చిత్రం ఏప్రిల్ 13, 2022 న ప్రపంచ వ్యాప్తం గా భారీగా థియేటర్లలో విడుదల అయ్యేందుకు సిద్దం అవుతోంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు కి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా బీస్ట్ థియేట్రికల్ ట్రైలర్‌ను ఏప్రిల్ 2, 2022న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. పలు భాషల్లో విడుదల కానున్న ఈ బిగ్గీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. తాజాగా మేకర్స్ చేసిన ప్రకటన తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :