కాఫీ విత్ కరణ్: వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ బోల్డ్ టీజర్!

Published on Jul 26, 2022 12:35 pm IST

దేశంలో చాలా మంది ఎదురుచూస్తున్న షోలలో కాఫీ విత్ కరణ్ ఒకటి. ఇప్పటికే రెండు ఎపిసోడ్‌లు పూర్తి కాగా ఇప్పుడు విజయ్ దేవరకొండ వంతు వచ్చింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ షో యొక్క టీజర్‌ను తాజాగా విడుదల చేయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ కోసం విజయ్ దేవరకొండ బాలీవుడ్ బ్యూటీ అనన్యతో జతకట్టాడు.

రేపటి నుండి ప్రసారం కానున్న ఈ షోలో విజయ్ ఫ్లింగ్స్ మరియు వన్ నైట్ స్టాండ్‌ల గురించి బోల్డ్‌గా మాట్లాడాడు. లుక్స్‌ని బట్టి చూస్తే, టీజర్ సూపర్ ఫన్‌గా మరియు చీజీ మూమెంట్స్‌తో నిండిపోయింది. వేగవంతమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి కొంచెం కూడా సిగ్గుపడని విజయ్‌ని కరణ్ జోహార్ అన్ని రకాల బోల్డ్ ప్రశ్నలు అడిగినట్లు కనిపిస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :