కేరళ లో న్యూ రికార్డు క్రియేట్ చేసిన విజయ్ ‘లియో’ ?

Published on Jun 3, 2023 11:04 pm IST

ఇళయదళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా యువ దర్శకడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ లియో. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ అనౌన్స్ మెంట్ టీజర్ తో పాటు పోస్టర్ అందరినీ ఆకట్టుకున్నాయి. సంజయ్ దత్, అర్జున్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్ ఎస్ లలిత్ కుమార్, పళని స్వామి గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న యాక్షన్ మూవీ లియో అక్టోబర్ 19 న విడుదల కానుంది.

ఇక ప్రస్తుతం కేరళ ఫిల్మ్ సర్కిల్స్ నుండి వస్తున్న తాజా అప్‌డేట్‌ ప్రకారం, లియో ప్రస్తుతం అక్కడ ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా భారీ రికార్డును నెలకొల్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కేరళ పంపిణీ హక్కులు రూ. 16 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. కేరళలో మళయాళేతర సినిమాకి ఇది అత్యధిక డీల్ అని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. తాజా ఒప్పందంతో, లియో గతంలో టాప్ బిజినెస్ చేసిన 2 పాయింట్ 0 (రూ. 14 కోట్లు), బాహుబలి 2 (రూ. 10.5 కోట్లు), ఆర్‌ఆర్‌ఆర్ (రూ. 10 కోట్లు) మరియు పొన్నియిన్ సెల్వన్ 2 (రూ. 9 కోట్లు) వంటి సినిమాల రికార్డులను అధిగమించింది. నిజానికి విజయ్ కి కేరళ అంతటా విపరీతమైన ప్రజాదరణ ఉంది మరియు లియో నెలకొల్పిన ఈ తాజా రికార్డ్ తో ఆయన స్టార్‌డమ్‌కు మరొకసారి రుజువు అయిందని తెలుస్తోంది. కాగా ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం :