ఆకట్టుకుంటున్న విజయ్ “లైగర్” హంట్ థీమ్!

Published on May 9, 2022 4:16 pm IST

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం లైగర్. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ పతాకాల పై సంయుక్తం గా నిర్మిస్తున్నారు. అనన్య పాండే ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుండగా, లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ ఈ చిత్రం లో కీలక పాత్రలో నటిస్తున్నారు. సీనియర్ నటి రమ్య కృష్ణ ఈ చిత్రం లో విజయ్ కి తల్లి పాత్రలో నటిస్తుంది.

ఈ చిత్రం ను ప్రకటించిన అనంతరం నుండి సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభించింది. తాజాగా విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా లైగర్ చిత్ర యూనిట్ లైగర్ హంట్ థీమ్ ను తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ తమిళ భాషల్లో విడుదల చేయడం జరిగింది. ఈ థీమ్ సాంగ్ టీజర్ విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం లో విజయ్ బాక్సర్ గా నటిస్తుండటం తో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 25, 2022 న భారీగా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :