లైగర్ సెన్సార్ పూర్తి… రన్ టైమ్ ఎంతంటే?

Published on Aug 5, 2022 4:40 pm IST

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా లైగర్. సాలా క్రాస్ బ్రీడ్ ఉప శీర్షిక. పాన్ ఇండియా మూవీ గా విడుదల కి సిద్దం అవుతోన్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం కి సెన్సార్ బోర్డు వారు యూ/ఎ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఈ చిత్రం 2 గంటల 20 నిమిషాల నిడివి ఉంది. విజయ్ దేవరకొండ మేకొవర్ సినిమా కి స్పెషల్ అట్రాక్షన్ కాగా, పూరి జగన్నాథ్ మార్క్ డైరెక్షన్, లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ కీ రోల్ సినిమా కి మరింత క్రేజ్ ను తీసుకొచ్చింది. రమ్య కృష్ణ కీలక పాత్ర లో నటిస్తున్న ఈ చిత్రం లో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ నెల 25 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :