తలపతి 63లో విజయ్ పాత్ర పేరు రివీల్ అయ్యింది !

vijay6

సర్కార్ తరువాత ఇళయదళపతి విజయ్ తలపతి 63 (వర్కింగ్ టైటిల్) లో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ చెన్నై లో స్టార్ట్ అయ్యింది. ఈ షెడ్యూల్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో విజయ్ కోచ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో విజయ్ పాత్ర పేరు మైఖేల్ అని సమాచారం. ఈచిత్రం లఘాన్, పీలే తరహాలో వుండనుందట.

ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో నయన తార కథానాయికగా నటిస్తుండగా యువ హీరో కథిర్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. భారీ బడ్జెట్ తో ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈచిత్రం ఈ ఏడాది దీపావళికి విడుదలకానుంది.

Exit mobile version