ఈ ఏడాది చివర్లో రానున్న విజయ్ దేవరకొండ తదుపరి చిత్రం !


‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ హీరో అయిపోయాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ గా ఉన్నాడు. వాటిలో ప్రముఖ నిర్మాణ సంస్థ ‘గీత ఆర్ట్స్’ సినిమా కూడా ఉంది. రాహుల్ సాంక్రిత్యన్ దర్శకత్వంలో, ‘గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా నాచ్యురల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోందని సమాచారం.

విజయ్ కి ఇది డిఫరెంట్ మూవీ అవుతుందని, ఇందులో అతను ఆసక్తికరమైన పాత్రలో కనిపిస్తాడని, ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడం పక్కా అని చిత్ర యూనిట్ చెప్తోంది. తాజా సమాచారం ప్రకారం,ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేయాలని గీతా ఆర్ట్స్’ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఫస్ట్ లుక్ ను, టీజర్ ను విడుదల త్వరలోనే చేయనున్నారు. దీన్ని కూడా కొత్త పద్దతిలో, వినూత్నమైన విధంగా ప్రమోట్ చేయనున్నారని తెలిసింది.