విజయ్ “వారసుడు” డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ ఓటిటి దిగ్గజం!

విజయ్ “వారసుడు” డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ ఓటిటి దిగ్గజం!

Published on Jul 30, 2022 1:30 AM IST

విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం వారసుడు. ఈ చిత్రం ను తమిళ్ లో వరీసు పేరిట తెరకెక్కిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజ్, శిరీష్ లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి దిగ్గజం అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం లో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం ను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు