టాక్..”విక్రమ్ 2″ స్టార్ట్ అయ్యేది అప్పుడేనట.!

Published on Jun 5, 2022 3:00 am IST

లేటెస్ట్ గా లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన సాలిడ్ బ్లాక్ బస్టర్ చిత్రం “విక్రమ్” ఇప్పుడు మరింత స్థాయిలో పికప్ అవుతుంది. మొత్తం పాన్ ఇండియా వైడ్ కూడా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రంపై సీక్వెల్ కూడా ఉన్నట్టుగా దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ హింట్ ఇవ్వగా ఇప్పుడు ఈ క్రేజీ సీక్వెల్ పై అందరిలో ఒక రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. పలు ఇంపార్టెంట్ రోల్స్ క్రాస్ ఓవర్ తో రానున్న ఈ సినిమాపై ఎనలేని హైప్ నెలకొంది.

అయితే మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది తెలుస్తుంది. ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి హీరో కమల్ అలాగే దర్శకుడు లోకేష్ ఇద్దరూ వేరే వేరేగా ఒకో సినిమా కంప్లీట్ చేస్తారట. కమల్ దర్శకుడు మహేష్ నారాయణన్ తో సినిమా చేయనుండగా లోకేష్ విజయ్ తో సినిమా చేయనున్నాడు. ఈ రెండు అయ్యాక విక్రమ్ పార్ట్ 2 స్టార్ట్ అవుతుందట. అంటే ఎలా లేదన్న ఇంకో ఏడాది తర్వాతే సినిమా స్టార్ట్ అవుతుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :