“తంగలాన్” గా విక్రమ్…గ్లింప్స్ తో సినిమా పై పెరిగిన అంచనాలు

“తంగలాన్” గా విక్రమ్…గ్లింప్స్ తో సినిమా పై పెరిగిన అంచనాలు

Published on Oct 23, 2022 11:44 PM IST


కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కెరీర్‌లో హైప్డ్ ప్రాజెక్ట్‌లలో విక్రమ్ 61 ఒకటి. విభిన్న చిత్ర నిర్మాణానికి పేరుగాంచిన పా.రంజిత్, ఒక పీరియాడికల్ యాక్షన్ డ్రామా కోసం బహుముఖ నటుడు విక్రమ్ తో జతకట్టారు. విక్రమ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇది. చిత్రబృందం హామీ ఇచ్చినట్లుగానే ఈ సినిమా టైటిల్‌ను ఈరోజు తంగలాన్ అని అధికారికంగా వెల్లడించారు. అలాగే, ఒక చిన్న గ్లింప్స్ ను విడుదల చేసారు మేకర్స్.

ఈ వీడియో లో విక్రమ్ కొత్త గా మరియు వైల్డ్ అవతార్‌ లో అద్భుతంగా కనిపిస్తున్నాడు. అలాగే, ఈ చిన్న వీడియోలో మాళవిక మోహనన్ మరియు ఇతర తారాగణం చూపించబడింది. కంటెంట్ చాలా ఆశాజనకంగా ఉంది మరియు విక్రమ్‌ ను బీస్ట్ మోడ్‌లో చూడటానికి మనం సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి ఉండాలి. ప్రముఖ స్టూడియో గ్రీన్ బ్యానర్ మరియు నీలం ప్రొడక్షన్స్‌ బ్యానర్ లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం కి జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు