తన బాలీవుడ్ సినిమాను అనౌన్స్ చేసిన విక్రమ్ !

7th, January 2018 - 06:17:47 PM

తెలుగు, తమిళం రెండు పరిశ్రమల్లో ఫాలోయింగ్ కలిగిన కొద్దిమంది హీరోల్లో చియాన్ విక్రమ్ కూడా ఒకరు. ఈయన నటనకు దేశవ్యాప్తంగా అభిమానాలున్నారు. అందుకే ఆయన బాలీవుడ్లోకి అడుగుపెట్టేందుకు సన్నద్ధమయ్యారు. అది కూడా ఆషా మాషీ సినిమాతో కాదు భారీ ప్రాజెక్టుతోనే కావడం విశేషం.

అదే మహాభారతంలోని గొప్ప పాత్ర అయిన కర్ణుడి జీవితం ఆధారంగా రూపొందనున్న ‘మహావీర్ కర్ణ’. ఈ చిత్రాన్ని ఆర్.ఎస్. విమల్ డైరెక్ట్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని న్యూయార్క్ కు చెందిన యునైటెడ్ ఫిలిమ్స్ కింగ్డమ్ సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుంది, ఇతర నటీనటులెవరు అనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇకపోతే విక్రమ్ ఈ ఏడాది ‘స్కెచ్, ధృవ నచ్చత్తిరమ్, సామి 2’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించనున్నారు.