సెన్సార్ కంప్లీట్ చేసుకున్న విక్రమ్ అవైటెడ్ “దృవనక్షత్రం”

Published on Sep 23, 2023 7:02 am IST


కోలీవుడ్ స్టార్ హీరో నటన అంటే ప్రాణం పెట్టే నటుడు చియాన్ విక్రమ్ హీరోగా ఇపుడు పలు సాలిడ్ చిత్రాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ మీనన్ తో చేసిన భారీ చిత్రం “దృవనక్షత్రం” అయితే అలా అవైటెడ్ గా లేట్ అవుతూ వస్తుంది. ఇక ఫైనల్ గా ఈ చిత్రం పనులు నేరుగా దర్శకుడే అన్నీ కలుగజేసుకొని రిలీజ్ చేస్తుండగా లేటెస్ట్ గా సినిమా సెన్సార్ అయితే కంప్లీట్ చేసుకున్నట్టుగా తెలిపాడు.

మరి ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో అయితే ఈ చిత్రం యూ/ఏ సర్టిఫికెట్ ని పొందినట్టుగా గౌతమ్ మీనన్ తెలిపాడు. అలాగే సినిమాపై మెయిన్ అప్డేట్ ఈ రోజు ఉదయం 11 గంటలకి అందిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసాడు. ఇక ఈ చిత్రానికి హరీష్ జై రాజ్ సంగీతం అందిస్తున్నాడు అలాగే అభిమానులు ఆ రిలీజ్ డేట్ కోసం చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :