తెలుగులో సాలిడ్ మార్క్ కి చేరుకున్న “విక్రమ్” వసూళ్లు.?

Published on Jun 12, 2022 1:40 pm IST


లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అలాగే ఫహద్ ఫాజిల్ ఇంకా స్టార్ హీరో సూర్య లు కీలక పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం “విక్రమ్ హిట్ లిస్ట్”. దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ డ్రామా మన తెలుగులో కూడా భారీ హిట్ అయ్యింది.

ఈ ఏడాదికి అయితే ఇప్పటి వరకు తమిళ్ నుంచి తెలుగులోకి వచ్చిన చిత్రాల్లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచి ఇంకా మంచి వసూళ్లను అందుకుంటూ దూసుకెళ్తుంది. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా తెలుగులో 25 కోట్ల గ్రాస్ సాలిడ్ మార్క్ ని క్రాస్ చేసినట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి.

చాలా కాలం తర్వాత కమల్ సినిమాకి మన తెలుగులో ఇదే అత్యధికం అని చెప్పాలి. మై ఫైనల్ రన్ లో అయితే ఈ చిత్రం ఎక్కడ ఆగుతుందో చూడాల్సిందే. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించగా కమల్ మరియు మహేంద్రన్ లు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :