“విక్రమ్” సినిమాలో కమల్ ప్రమేయంపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.!

Published on May 23, 2022 4:03 pm IST

విశ్వ నటుడు కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “విక్రమ్”. కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతుంది. అయితే ఈ సినిమా ఒక సాలిడ్ యాక్షన్ డ్రామా అనే అంశం కన్నా అంతకు మించి కొందరి విలక్షణ నటుల కలయిక కావడంతో ఆడియెన్స్ ఈ సినిమా చూడాలని చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

అయితే ఈ సినిమాలో మెయిన్ హీరోగా కనిపిస్తున్న కమల్ తన ఎక్స్ పీరియన్స్ లో ఎన్నో సినిమాలు చేసి దర్శకత్వం కూడా వహించారు. ఇప్పుడు ఇదే మార్క్ ఈ సినిమాకి కూడా తాను కలుగజేసుకున్నారనే కామెంట్స్ ఉండగా వాటికి దర్శకుడు లోకేష్ ఒక క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ సినిమా విషయంలో అసలు కమల్ ఎక్కడా కూడా తన డైరెక్షన్ లో ప్రమేయం కాలేదని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆయన ఒక నటుడుగా నేను దర్శకునిగా మాత్రమే ఉన్నామని ఆ కామెంట్స్ పై క్లారిటి ఇచ్చాడు.

సంబంధిత సమాచారం :