విక్రమ్ డైరెక్టర్ లోకేష్ ఆలోచనలో పడ్డారా … ??

Published on Jun 24, 2022 3:00 am IST

కొన్నేళ్ల క్రితం సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన నగరం మూవీతో తొలిసారిగా దర్శకుడిగా మెగాఫోన్ పట్టిన యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్, ఆ మూవీతో మంచి పేరు అందుకున్నారు. తరువాత కార్తీ తో ఖైదీ మూవీ తీసి దానితో కూడా సక్సెస్ కొట్టిన లోకేష్, ఆపైన ఏకంగా ఇలయతలపతి విజయ్ తో మాస్టర్ మూవీ తీసి దానితో కూడా విజయం అందుకున్నారు. ఇక లేటెస్ట్ గా కమల్ హాసన్ తో ఆయన తీసిన విక్రమ్ మూవీ పెద్ద సెన్సేషనల్ సక్సెస్ కొట్టి దాదాపుగా మూడొందల కోట్లరూపాయలు పైగా కలెక్షన్ ని కొల్లగొట్టి ప్రస్తుతం ఇంకా థియేటర్స్ లో దూసుకుపోతోంది.

అయితే మల్టివర్స్ మూవీగా తెరకెక్కిన విక్రమ్ మూవీ అనంతరం ఆయన నెక్స్ట్ కార్తీతో ఖైదీ 2 మూవీ తీస్తారా లేక విక్రమ్ 2 మూవీ తీస్తారా అనేది ప్రస్తుతం ప్రేక్షకాభిమానులు అందరి మనసులో మెదులుతున్న ప్రశ్న. నిజానికి ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా లోకేష్ మాట్లాడుతూ, తదుపరి ఇలయతలపతి విజయ్ తో మూవీ చేస్తున్నట్లు చెప్పిన లోకేష్, ఆ తరువాతనే ఈ సినిమాల గురించి ఆలోచిస్తానని అన్నారు. మరోవైపు లోకేష్ లిస్ట్ లో టాలీవుడ్ స్టార్ యాక్టర్ రామ్ చరణ్, అలానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఉన్నట్లు సమాచారం. మొత్తంగా విక్రమ్ మూవీ భారీ విజయంతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ క్రేజ్ సొంతం చేసుకున్నారు లోకేష్ కనకరాజ్.

సంబంధిత సమాచారం :