వైరల్ : “పొన్నియిన్ సెల్వన్” ప్రమోషన్స్ లో విక్రమ్ ఎక్సలెంట్ స్పీచ్.!

Published on Sep 25, 2022 1:08 pm IST

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న తమిళ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “పొన్నియిన్ సెల్వన్”. మాస్టర్ ఫిల్మ్ మేకర్ మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ గా చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి అలాగే ఎందరో స్టార్ నటీ నటులు నటించిన ఈ చిత్రంలో మొదటి భాగం విడులకి దగ్గరలో ఉంది.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమాకి అగ్రెసివ్ గా ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ ఇప్పుడు పాల్గొంటుంది. ఇందులో భాగంగా హీరో విక్రమ్ ఇచ్చిన ఓ అద్భుతమైన స్పీచ్ సినీ వర్గాల్లో ఇంటెన్స్ గా వైరల్ అవుతుంది. మన దేశపు కల్చర్ ఎప్పుడో టెక్నలాజి లేక ముందే రాజులు వారి పరిపాలన తీరు, కట్టడాలు ఇలా ఎన్నో అంశాలపై తాను ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

ఇలాంటి కథలు ఇండియాలో ఎవరు ఎక్కడ నుంచి చెప్తున్నారు అని కాదు ఇది మన చరిత్ర నేను భారతీయుడిని దీన్ని చెప్పడానికి గర్విస్తున్నాని విక్రమ్ తెలిపారు. దీనితో ఈ సాలిడ్ స్పీచ్ అన్ని సినీ వర్గాల్లో మంచి ఆసక్తిగా వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :