“విక్రమ్” మళ్ళీ ముందు డేట్ కే స్ట్రీమింగ్..?

Published on Jun 29, 2022 9:00 am IST


కమల్ హాసన్ హీరోగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అలాగే ఫహద్ ఫాజిల్ లాంటి నటులు కీలక పాత్రల్లో సూర్య స్పెషల్ క్యామియో లో నటించిన లేటెస్ట్ చిత్రం “విక్రమ్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తెరకెక్కించిన ఈ లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ అంచనాలకు మించి సెన్సేషనల్ హిట్ కాగా ఇంకా తమిళ నాట సాలిడ్ థియేట్రికల్ రన్ ని కొనసాగిస్తోంది.

అయితే ఈ సినిమా ఓటిటి రిలీజ్ పట్ల గత కొన్ని రోజులు నుంచి కొన్ని వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. జూలై 8 నుంచి స్ట్రీమింగ్ లేదా అంతకు ముందే స్ట్రీమింగ్ అంటూ పలు వార్తలు వినిపించగా వీటిలో అయితే ఫైనల్ గా ముందు వినిపించిన డేట్ జూలై 8 నే డిస్నీ+ హాట్ స్టార్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కి రాబోతున్నట్టు తెలుస్తుంది. సినిమా రిలీజ్ అయ్యిన అన్ని భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కి రాబోతుందట. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందివ్వగా కమల్ మరియు ఆర్ మహేంద్రన్ లు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :