తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ వసూళ్ళను రాబడుతోన్న “విక్రమ్”

Published on Jun 6, 2022 6:00 pm IST


కమల్ హాసన్ హీరోగా లోకేశ్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ విక్రమ్ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రం తమిళనాట ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సైతం డీసెంట్ వసూళ్ళను రాబడుతోంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల షేర్ ను సాధించినట్లు తెలుస్తోంది.

అయితే ఈరోజు నుంచి వీక్ డేస్ మొదలు కావడం తో సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది చూడాలి. తమిళనాడులో ఈ సినిమా మూడు రోజుల్లోనే 50 కోట్ల మార్క్‌ను దాటేసింది. కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించగా, ఫాహద్ ఫజిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. సూర్య మరో పవర్ ఫుల్ పాత్ర లో కనిపించారు.

సంబంధిత సమాచారం :