ఆకట్టుకుంటున్న “విక్రమ్ గౌడ్” స్పెషల్ పోస్టర్..!

Published on Jul 5, 2022 9:00 am IST

కన్నడ నటుడు కిరణ్ రాజ్ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతోన్నారు. కన్నడలో రీసెంట్‌గా వచ్చిన బడ్డీస్ సినిమాతో కిరణ్ రాజ్ హీరోగా మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఇప్పుడు విక్రమ్ గౌడ్ అంటూ కిరణ్ రాజ్ తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించేందుకు రెడీ అవుతున్నారు. కుమారి సాయి ప్రియ సమర్పణలో మహేశ్వర పిక్చర్స్ బ్యానర్‌పై కణిదరపు రాజేష్, పి. ఉషారాణి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పాశం నరసింహారావు దర్శకత్వం వహిస్తున్నారు. కిరణ్ రాజ్, దీపికా సింగ్ హీరో హీరోయిన్లుగా తెలుగు, కన్నడ భాషలలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

కిరణ్ రాజ్ పుట్టిన రోజు(జూలై 5) సందర్భంగా విక్రమ్ గౌడ్ నుంచి ఓ కొత్త పోస్టర్‌ను మేకర్లు విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో కిరణ్ రాజ్ పూర్తిగా రగ్డ్ లుక్‌లో కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, పోస్టర్లకు విపరీతమైన స్పందన లభించింది.

పోసాని కృష్ణమురళీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రానికి లొట్టిపలి రామకృష్ణ సహ నిర్మాతగా, పామరాజు జానకి రామారావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. మంత్ర ఆనంద్ సంగీతాన్ని అందిస్తుండగా, రాఘవేంద్ర బి కోలారి కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌గా జె.పి. పని చేస్తున్నారు. ఈ చిత్రం చివరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుందని చిత్రయూనిట్ తెలిపింది.

కిరణ్ రాజ్, దీపికా సింగ్, పోసాని కృష్ణమురళీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం పాశం నరసింహారావు, నిర్మాత కణిదరపు రాజేష్, పి. ఉషారాణి, సంగీతం మంత్ర ఆనంద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ పామరాజు జానకి, రామారావు, ఎడిటర్ జె.పి, సినిమాటోగ్రఫీ రాఘవేంద్ర. బి. కోలారి, పి.ఆర్.ఓ సాయి సతీష్, పర్వతనేని రాంబాబు లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :