ఇకపై ఆ ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ లో కూడా ప్రసారం కానున్న కమల్ హాసన్ ‘విక్రమ్’

Published on Aug 17, 2022 6:09 pm IST

ఉలగ నాయగన్ కమల్ హాసన్ హీరోగా విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాసిల్ కీలక పాత్రల్లో కనిపించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ విక్రమ్ హిట్ లిస్ట్. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఎంతో భారీ స్థాయిలో దీనిని తెరకెక్కించారు. ఇక ఇందులో హీరో కమల్ అత్యద్భుత నటనతో పాటు దర్శకుడు లోకేష్ అద్భుత దర్శకత్వ ప్రతిభ మూవీని ఎంతో పెద్ద సక్సెస్ చేసాయి.

అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకున్న విక్రమ్ ఇటీవల డిస్నీ హాట్ స్టార్ ద్వారా ఒటిటి ప్రేక్షకుల ముందుకు వచ్చి అక్కడ కూడా అత్యద్భుతంగా రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అయితే విక్రమ్ మూవీని త్వరలో ఓవర్సీస్ ఆడియన్స్ కోసం మరొక ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహా లో కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. కొద్దిసేపటి క్రితం దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. అయితే ఇది ఇండియా, చైనా దేశాల వారికి మాత్రం లభ్యం కాదు.

సంబంధిత సమాచారం :