ఓ మెసేజ్ ని కమర్షియల్ గా చెప్పడంలో దిట్ట అనిపించుకున్న సక్సెస్ఫుల్ డైరెక్టర్ శంకర్, సినిమా కోసం ఏమన్నా చేసే చియాన్ విక్రమ్ కాంబినేషన్ లో రానున్న సినిమా ‘ఐ’. శంకర్ మొదటిసారి ట్రై చేసిన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ కోసం సౌత్ ఇండియన్ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకోవడంతో డిసెంబర్ 5న సెన్సార్ సర్టిఫికేట్ కోసం పంపనున్నారు.
ఇప్పటికే ఈ సినిమాని జనవరి 9న రిలీజ్ చేయ్యనున్నారని వార్తలు వస్తున్నాయి, కానీ ఈ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఈ చిత్ర టీం అఫీషియల్ గా ఓ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన రోజు నుంచి అప్పటి వరకూ ఉన్న అంచనాలు డబుల్ అయ్యాయి. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఇండియన్ ఫిల్మ్ స్టాండర్డ్స్ ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళేలా ‘ఐ’ ఉంటుందని ఈ చిత్ర టీం అంటోంది.
విక్రమ్ మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించిన ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించింది. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని ఆస్కార్ రవిచంద్రన్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించాడు.
