విక్రమ్ కుమార్ నెక్స్ట్ సినిమా హీరో ఎవరు ?

హలో సినిమా తరువాత విక్రమ్ కుమార్ కార్తీ తో సినిమా చెయ్యబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సూర్య ఈ సినిమాను తన సొంత బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్స్ లో నిర్మించబోతున్నాడని సమాచారం. ఇటీవల ఖాకీ సినిమాతో మంచి విజయం సాధించిన కార్తీతో విక్రమ్ కుమార్ సినిమా అంటే ప్రాజెక్ట్ పై ఇంట్రెస్ట్ కలగడం సహజం.

కార్తీ సినిమా తరువాత నాగ చైతన్య తో విక్రమ్ కుమార్ సినిమా చెయ్యబోతున్నట్లు నాగార్జున హలొ మూవీ ప్రమోషన్స్ లో తెలిపాడు. కార్తీ, విక్రమ్ కుమార్ సినిమాకు సంబంధించిన వార్తా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ మూవీకి సంభందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని సమాచారం.