సెన్సార్ పూర్తి చేసుకున్న కమల్ హాసన్ “విక్రమ్” మూవీ..!

Published on May 26, 2022 1:18 am IST


విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ “విక్రమ్”. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ బ్యానర్‌పై కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విలక్షణ నటులు విజయ్ సేతుపతి మరియు ఫహద్ ఫాజిల్ కూడా నటిస్తున్నారు.

అయితే తాజాగా ఈ చిత్రం సెన్సార్‌ని పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చారు. ఇకపోతే 2022 జూన్ 3వ తేది తెలుగు, త‌మిళంతోపాటు ప‌లు భారతీయ భాష‌ల్లో విడుద‌ల కాబోతున్న ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా పనిచేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :