ట్రెండింగ్ : ‘విక్రమ్’ ఓటిటి రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ డిస్కషన్

Published on Jul 1, 2022 12:29 am IST

రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ సంస్థపై ఉలగ నాయగన్ కమల్ హాసన్ హీరోగా నటిస్తూ స్వయంగా ఎంతో భారీ ఎత్తున నిర్మించిన మూవీ విక్రమ్ హిట్ లిస్ట్. మాస్టర్, ఖైదీ సినిమాల దర్శకుడు లోకేష్ కనకరాజ్ తీసిన ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద సక్సెస్ కొట్టింది. ఇప్పటివరకు మొత్తంగా అన్ని భాషల్లో కలిపి నాలుగు వందల కోట్లకు పైగా కలెక్షన్ అందుకున్న విక్రమ్ మూవీ ప్రస్తుతం అక్కడక్కడా పలు ప్రాంతాల్లో ఇంకా మంచి కలెక్షన్స్ తో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాసిల్ కీలక పాత్రలు చేసిన ఈ మూవీ థ్రిల్లింగ్ గా సాగె యాక్షన్ జానర్లో తెరకెక్కి అందరినీ ఎంతో ఆకట్టుకుంది.

ఇక ఈ మూవీ జులై 8న డిస్నీ హాట్ స్టార్ ఒటిటి మాధ్యమం ద్వారా బుల్లితెర ఆడియన్స్ ముందుకు రానుంది. అయితే విషయం ఏమిటంటే, ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి రిలీజ్ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 వంటి భారీ సినిమాలు అటు థియేటర్స్ తో పాటు ఓటిటి లో కూడా భారీ స్థాయి వ్యూస్ అందుకుని ఆడియన్స్ ని అలరించడంతో, మరి విక్రమ్ ఏ స్థాయిలో పెర్ఫార్మ్ చేస్తుందో, ఎంత మేర వ్యూస్ అందుకుంటుందో అనే ఆసక్తి అన్ని భాషల ఆడియన్స్ లో విపరీతంగా నెలకొంది. మరోవైపు తప్పకుండా విక్రమ్ ఇటు థియేటర్స్ లో మాదిరిగా అటు ఓటిటి లో కూడా సూపర్ గా అదరగొట్టడం ఖాయం అంటున్నారు మూవీ లవర్స్. మరి త్వరలో ఒటిటి కి రానున్న విక్రమ్ ఎంతమేర అదరగొడతాడో చూడాలి.

సంబంధిత సమాచారం :