తెలుగులో సాలిడ్ గా నిలబడుతున్న “విక్రమ్”.!

Published on Jun 9, 2022 9:00 pm IST

లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అలాగే స్టార్ హీరో సూర్య పవర్ ఫుల్ క్యామియోలో అలాగే నటుడు ఫహద్ ఫాజిల్ లు ఇంట్రెస్టింగ్ రోల్స్ లో నటించిన ఇండియాస్ బెస్ట్ మల్టీ స్టారర్ “విక్రమ్”. దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తెరకెక్కించిన ఈ సినిమా మన తెలుగులో అయితే డీసెంట్ బజ్ లోనే రిలీజ్ అయ్యింది.

కానీ తర్వాత తర్వాతికి మాత్రం ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఆదరణ అందిస్తూ వస్తున్నారు. ఇప్పుడుకి అయితే ఈ సినిమాకి ప్రతి రోజు ఈజీ గా స్టడీగా కోటి రూపాయల మేర షేర్ నమోదు అవుతుందట. దీనితో విక్రమ్ మాత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ గా నిలబడింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా కమల్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :