కమల్ పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ గా స్టార్ట్ చేసిన టీమ్ “విక్రమ్”

Published on Nov 2, 2021 8:23 am IST

కమల్ హాసన్ పుట్టిన రోజు వేడుకలను టీమ్ విక్రమ్ నిన్న గ్రాండ్ గా మొదలు పెట్టింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నటుడు గా, డాన్సర్ గా, స్క్రీన్ రైటర్ గా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, సింగర్ గా, లిరిసిస్ట్ గా రాణించిన కమల్ హాసన్ తన పుట్టిన రోజును నవంబర్ 7 వ తేదీన జరుపోకొనున్నారు.

కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న విక్రం చిత్రం కి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫజిల్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ మరియు ఆర్. మహీంద్రన్ లు నిర్మిస్తున్నారు. కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుండి అద్దిరిపోయే ట్రీట్ అభిమానుల కోసం వేచి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ను వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :