‘మహేష్ – రాజమౌళి’ సినిమాలో విలన్ గా స్టార్ హీరో ?

Published on Nov 21, 2021 10:21 pm IST

నేషనల్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి త‌న నెక్ట్స్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన విలన్ ఎంపిక గురించి ఫిల్మ్‌నగర్‌లో ఓ టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాలో విలన్‌ గా హీరో విక్రమ్‌ నటిస్తున్నాడని తెలుస్తోంది. అయితే, ఈ వార్త పై ఎలాంటి అధికార అప్ డేట్ లేదు. ప్రస్తుతం రాజమౌళి అండ్ ఆయన టీమ్ ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారట. ఈ సంవత్సరం చివరి నాటికి ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది. ఇప్పటికే రచయిత విజయేంద్రప్రసాద్‌ మహేశ్‌ కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్టు రాశారట.

ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌ లో అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఈ కథా నేపథ్యం సాగుతుందని తెలుస్తోంది. ఆ మధ్య విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాయాలనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి రాజమౌళి – మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఉండబోతుంది.

సంబంధిత సమాచారం :