మహేష్ సినిమాలో విక్రమ్ ప్రభు ?

మహేష్ సినిమాలో విక్రమ్ ప్రభు ?

Published on Dec 26, 2022 11:00 PM IST

మహేష్ బాబు తన తాజా చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని, త్రివిక్రమ్ ఈ సినిమాను మహేష్ తో ప్లాన్ చేస్తున్నాడు. ఐతే, ఈ సినిమాలో ఇప్పుడు ఓ కీలక పాత్రలో ‘పొన్నియిన్ సెల్వన్’ నటుడు నటించబోతున్నాడని తెలుస్తోంది. తమిళ యంగ్ హీరో విక్రమ్ ప్రభు ఓ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో ఈ చిత్రంలో నటించబోతున్నాడు.

విక్రమ్ ప్రభు పాత్ర పూర్తిగా నెగిటివ్ గా ఉంటుందని.. ముఖ్యంగా విక్రమ్ ప్రభు – మహేష్ బాబు పాత్రల మధ్య డ్రామా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

కాగా హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు