విక్రమ్ మరో అవైటెడ్ సినిమా కూడా ఈ ఏడాది లోనే..!

Published on Oct 2, 2022 6:24 pm IST

కోలీవుడ్ స్టార్ హీరో విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ నుంచి ఈ ఏడాది జస్ట్ ఈ రెండు నెలల్లోనే రెండు సినిమాలు ఆడియెన్స్ ముందుకు వచ్చాయి. విక్రమ్ నటించిన కోబ్రా అలాగే భారీ పాన్ ఇండియా సినిమా “పొన్నియిన్ సెల్వన్ 1” చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యి మంచి ఓపెనింగ్స్ ని అందుకున్నాయి. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ అయితే టాక్ తో సంబందం లేకుండా భారీ వసూళ్లు తమిళ్ వెర్షన్ లో అందుకుంటుంది.

ఇక మళ్ళీ ఈ ఏడాది లోనే విక్రమ్ మరో సినిమా ఉండొచ్చని తెలుస్తుంది. అదే విక్రమ్ మరియు దర్శకుడు గౌతమ్ మీనన్ కాంబోలో తెరకెక్కించిన సాలిడ్ ప్రాజెక్ట్ “దృవ నచింతరం”. ఎప్పుడో మొదలు పెట్టిన ఈ చిత్రం కోసం ఆడియెన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఫైనల్ గా అయితే ఈ చిత్రం రిలీజ్ ఈ డిసెంబర్ లో లాక్ చేసినట్టుగా టాక్. మరి దీనిపై అయితే అధికారిక అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :