విక్రమ్ “కోబ్రా” కి ట్రైలర్ తో మరింత హైప్..?

Published on Aug 27, 2022 5:04 pm IST

ఇండియన్ సినిమా దగ్గర నటన కోసం ఎంతవరకు అయినా వెళ్లగలిగే అతి కొద్ది మంది స్టార్ హీరోస్ లో చియాన్ విక్రమ్ కూడా ఒకరు. మరి తాను హీరోగా ఇప్పటి వరకు ఎన్నో ఐకానిక్ పాత్రల్లో చేసాడు అలాగే ఎన్నో డిఫరెంట్ మేకప్స్ తో కొత్త రోల్స్ లో కూడా కనిపించాడు. కానీ ఇప్పుడు తాను చేసిన లేటెస్ట్ సినిమా “కోబ్రా” లో అయితే ఏకంగా 18కి పైగా రోల్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

మరి దీనితో అయితే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా దీనిపై అయితే నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ తో మాత్రం ఇప్పటివరకు జరిగిన లేట్ కి గాను కావాల్సిన హైప్ డెఫినెట్ గా వచ్చిందని చెప్పొచ్చు. ఒక్క తమిళ్ లోనే కాకుండా మన తెలుగులో ఆడియెన్స్ కూడా ఈ సినిమా ట్రైలర్ కూడా ఎగ్జైట్ అవుతున్నారు. దీనితో ఈ సినిమాకి తెలుగులో కూడా మంచి ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి జ్ఞ్యాన ముత్తు దర్శకత్వం వహించగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అలాగే ఈ చిత్రం ఈ ఆగస్ట్ 31న రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :