ఈ జానర్ సినిమా అంటే కష్టం అంటున్న “విక్రమ్” దర్శకుడు.!

Published on Jun 9, 2022 8:00 pm IST

లేటెస్ట్ గా సౌత్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వచ్చి భారీ హిట్ గా నిలిచిన చిత్రాల్లో లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “విక్రమ్” కూడా ఒకటి. అయితే ఈ చిత్రం విడుదల అయ్యిన అన్ని భాషల్లో కూడా సాలిడ్ రిపోర్ట్స్ అందుకొని అంతకంతకు స్ట్రాంగ్ గా నిలబడుతుంది.

మరి ఈ సక్సెస్ తో తాజాగా దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ ఒక చాట్ సెషన్ నిర్వహించగా తనకు పలు ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే తన నుంచి ఒక కంప్లీట్ లవ్ స్టోరీ లాంటి సినిమాలు ఏమన్నా ఆశించవచ్చా అని ఓ నెటిజన్ అడగ్గా ఇలాంటి సినిమాలు అయితే నా నుంచి చాలా కష్టమే తన వల్ల ఈ జానర్ సినిమాలు అవ్వవని ఓపెన్ గానే క్లారిటీ ఇచ్చేసాడు. అంటే లోకేష్ నుంచి పూర్తిగా మంచి యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్స్ మాత్రమే వస్తాయి అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :