ఇంట్రెస్టింగ్..3డి లో విక్రమ్ భారీ చిత్రం.!

ఇంట్రెస్టింగ్..3డి లో విక్రమ్ భారీ చిత్రం.!

Published on Mar 21, 2023 9:02 AM IST

మన ఇండియన్ సినిమా దగ్గర నటన కోసం ఎంత దూరం అయినా వెళ్లగలిగే స్టార్ హీరోస్ లో కోలీవుడ్ నటుడు చియాన్ విక్రమ్ కూడా ఒకరు. మరి తన కెరీర్ లో ఎన్నో విలక్షణమైన పాత్రలు చేసిన విక్రమ్ ఇప్పుడు వెర్సటైల్ దర్శకుడు పా రంజిత్ తో “తంగళాన్” అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా పోస్టర్ లు టీజర్ లతో మంచి ఆసక్తి రేపగా ఇప్పుడు దీనిపై మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు బయటకి వచ్చింది.

ఈ భారీ సినిమాకి అయితే వరల్డ్ వైడ్ గా 3డి రిలీజ్ ఉంటుందని కన్ఫర్మ్ అయ్యింది. మరి దీనిని అయితే నిర్మాత జ్ఞ్యాన వేల్ రాజా కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ భారీ సినిమా 3డి లో రిలీజ్ అవ్వడం కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. ఇక షూటింగ్ శరవేగంగా కంప్లీట్ చేసుకుంటున్న ఈ సినిమాని నీలం ప్రొడక్షన్స్ వారు మరియు గ్రీన్ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు