“కూలి” కోసం సర్కార్ టెక్నీషియన్.!

“కూలి” కోసం సర్కార్ టెక్నీషియన్.!

Published on Jul 3, 2024 6:00 PM IST

ప్రస్తుతం తలైవర్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా పలు చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ భారీ చిత్రం “కూలి” కూడా ఒకటి. ,మరి టైటిల్ టీజర్ తోనే అదరగొట్టిన ఈ చిత్రం మధ్యలో ఆగిపోయింది అని పుకార్లు వస్తే వాటికీ లోకి చెక్ పెట్టాడు. ఇక ఈ సినిమా విషయంలో మరో సాలిడ్ అప్డేట్ ని తాను అందించాడు.

తన సినిమా కోసం ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గిరీష్ గంగాధరన్ ని ఎంపిక చేసినట్టుగా తెలిపాడు. “విక్రమ్” సినిమా తర్వాత మరోసారి తనతో వర్క్ చేయడం ఆనందంగా ఉందని మరిన్ని అప్డేట్స్ త్వరలో వస్తాయని ఈ అప్డేట్ తో అందించాడు. అయితే ఈ సినిమాటోగ్రాఫర్ ఈ సినిమా సహా దళపతి విజయ్ తో “సర్కార్” చిత్రానికి కూడా వర్క్ చేసాడు. అలాగే తమిళ్ లో మరో ఐకానిక్ సినిమా “జల్లికట్టు” కూడా ఇతను చేసింది. దీనితో కోలీవుడ్ ఆడియెన్స్,మూవీ లవర్స్ తలైవర్ సినిమాకి క్రేజీ విజువల్స్ ని ఆశిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు