“విక్రమ్” స్పెషల్ ఫస్ట్ సింగిల్..తెలుగులో కూడా అదరగొట్టిన కమల్.!

Published on May 27, 2022 12:00 pm IST

లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “విక్రమ్” కోసం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తో చేసిన ఈ సాలిడ్ యాక్షన్ డ్రామా పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమాకి సంగీత దర్శకుడు అనిరుద్ సాలిడ్ ఆల్బమ్ ఇవ్వగా ఆల్రెడీ ఒరిజినల్ వెర్షన్ తమిళ్ లో సాంగ్స్ మంచి హిట్ అయ్యాయి.

ఇక ఇప్పుడు తెలుగులో కూడా తమిళ్ లో రిలీజ్ అయ్యి భారీ చార్ట్ బస్టర్ అయినటువంటి ఫస్ట్ సింగిల్ ని తెలుగు వెర్షన్ లో రిలీజ్ చేశారు. అయితే మరి మన తెలుగులో కూడా ఈ సాంగ్ సూపర్బ్ గా ఉందని చెప్పాలి. తమిళ్ లో కమల్ రాసి పాడిన ఈ సాంగ్ ని తెలుగులో చంద్రబోస్ మంచి మాస్ అండ్ క్యాచీ లిరిక్స్ రాయగా తెలుగులో కూడా కమల్ నే ఈ సాంగ్ ని ఆలపించడం మరింత విశేషంగా మారింది. తెలుగులో కూడా ఈ సాంగ్ మంచి చార్ట్ బస్టర్ అయ్యేలా అనిపిస్తుంది. మరి ఓవరాల్ రెస్పాన్స్ ఎలా వస్తుందో చూడాలి.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :