విక్రమ్ ‘తంగలాన్’ లేటెస్ట్ షూట్ అప్ డేట్

Published on Jun 7, 2023 10:30 pm IST

ఇటీవల పొన్నియన్ సెల్వన్ 1, 2 సినిమాలతో అద్భుత విజయాలు సొంతం చేసుకున్నారు చియాన్ విక్రమ్. ఆ సినిమాల్లో ఆదిత్య కరికాలుడిగా మరొక్కసారి తన ఆకట్టుకునే అద్భుత నటనతో ఆడియన్స్ ని అలరించారు విక్రమ్. ఇక ప్రస్తుతం సంచలన దర్శకుడు పా రంజిత్‌తో విక్రమ్ తదుపరి తంగలన్ అనే భారీ పాన్ ఇండియన్ సినిమాలో నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగె ఈ సినిమాలో మాళవిక మోహనన్ మరియు పార్వతి తిరువోతు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కోలీవుడ్ లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ మూవీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్ ని వచ్చేవారం ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

జూన్ 15 లేదా 17న షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ రెండు వారాల సుదీర్ఘ షెడ్యూల్‌లో చియాన్ విక్రమ్ మరియు ఇతర ప్రధాన నటీనటులు సెట్స్‌లో పాల్గొననున్నారు. పశుపతి, డేనియల్ కాల్టాగిరోన్ మరియు ఇతరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా దీనిని పలు విదేశీ భాషలలో 2D మరియు 3D ఫార్మాట్లలో విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు మేకర్స్. స్టూడియో గ్రీన్ మరియు నీలం ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రూపొందించిన తంగలాన్ కు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :